జనసేనలో చేరిన రాజోలు వైసిపి నేతలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంఛార్జిలతో గురువారం కాకినాడలో జరిగిన సమీక్షా సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి అధికార పార్టీ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎంపీటీసీ, సర్పంచులు, మాజీ వైఎస్సార్సీపి గ్రామశాఖ అధ్యక్షులు, మరియు వివిధ సామాజిక వర్గాల నుండి అనేక మంది గురువారం కాకినాడ ముత్తాస్ గ్రాండ్ నందు జనసేన పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు గుండుబోగుల నరసింహారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్, రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణ భాస్కర్ రావు, రావూరి నాగు, అల్లూరు రంగరాజు, ఉండపల్లి అంజి, కొల్లు వెంకటరాజు, బొమ్మిడి ఏడుకొండలు, కొణతం నరసింహారావు, బైరా నాగరాజు, రాపాక మహేష్, ఓగూరు మనోహర్, రాజోలు ఎంపిటిసి సభ్యులు శ్రీమతి దార్ల కుమారి లక్ష్మి చినబాబు, జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.