కారణాలు గిరిజన ప్రజలకు తెలియజేయాలి: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు కలెక్టర్ అఫిస్ గతవారం ఒక పత్రికలో వచ్చిన కథనం మేరకు స్పందించిన జనసేనపార్టీ నాయకులు 5వ షెడ్యూల్ ప్రాంతంలో జరిగే భూ క్రయ, విక్రయాలకు సంబంధించి భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నాన్ షెడ్యూల్ ప్రాంతమైన అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగులకు తరలించారు. ఇలా ఎలా షెడ్యూల్ ప్రాంతపు భూములను రిజిస్ట్రేషన్ ప్రక్రియ నాన్ షెడ్యూల్ ప్రాంతమైన మాడుగులలో ఏర్పాటుకు గల కారణాలు గిరిజన ప్రజలకు తెలియజేయాలని జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు వీరమహిళలు కిటలంగి పద్మ, బి.దివ్యలత, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ తదితర జనసైనికులు కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి లేఖ అందించారు. అందుకు బదులుగా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందిస్తూ కేవలం భవనాలు కొరత సమస్య కారణంగా మరియు పరిపాలన సౌలభ్యం,వేగం కోసం ముందస్తు చర్యలలో భాగంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని ఇందులో 5వ షెడ్యూల్ ఏరియా భూ విధానానికి విరుద్దంగా జరగదని అలా జరిగితే అది చట్టవిరుద్దమని గిరిజనప్రజాలకు ఎటువంటి సందేహాలకు తావు లేదని తెలిపారు. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య వీరమహిళలు కిటలంగి పద్మ, బి.దివ్యలత, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మజ్జి నగేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.