రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రస్థానం చారిత్రాత్మకం

  • పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం
  • జనసైనికులు క్షేత్రస్థాయిలో మమేకమవ్వాలి
  • జనసేన బలోపేత సభలో జిల్లా, నగర అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఉన్నతమైన ఆశయాలు, పవన్ కల్యాణ్ భావజాలమే పునాదిగా జనసేన పార్టీ ఆవిర్భవించిందని, రాష్ట్ర రాజకీయాల్లోనే జనసేన ప్రస్థానం చారిత్రాత్మకమైనదని జనసేన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ 40 వ డివిజన్ అధ్యక్షుడు విన్నకోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పెదపలకలూరులో జరిగిన జనసేన పార్టీ బలోపేత సభకు వారు ముఖ్యఅతిధులుగా పాలోన్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున తటస్థులు, వైసీపీకి చెందిన వారు పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను, దళితులను జగన్ నమ్మించి వంచించారని ధ్వజమెత్తారు. వైసీపీ దాష్టీకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క జనసేనకే ఉందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు రాయపాటి అరుణ, కన్నా రజనీలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చారిత్రక అవసరమన్నారు. ప్రజాసమస్యలపై జనసైనికులు, వీరమహిళలు చేస్తున్న నిరంతర పోరాటమే జనసేన పార్టీకి బలమన్నారు. పత్తిపాడు నియోజకవర్గ సమన్వయ కర్త కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పత్తిపాడు గడ్డ జనసేన అడ్డ అన్నారు. జనసైనికులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవాలన్నారు. తొలుత గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి బాణాసంచా కాలుస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీలో చేరిన వారితో పార్టీకి నిబద్ధతతో పనిచేస్తామని, పార్టీ అధినేత నిర్ణయాలను తూ చా తప్పకుండా పాటిస్తామని, రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్ లు ప్రమాణం చేపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, రత్తయ్య, ప్రసాద్, ఆళ్ళ హరి, చింతా రాజు, సోమి ఉదయ్, యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, సుంకే శ్రీను, పులిగడ్డ గోపి, సునీల్, అడపాల శివ నాగేశ్వరరావు, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, పసుపులేటి రమేష్ యాదవ్, కరణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.