లివిటి ఫుట్లో తక్షణమే పాఠశాల భవనం మంజూరు చేయాలి

అరకు నియోజకవర్గంలో డుంబ్రిగుడా మండలంలోగల పోతాంగి పంచాయితీ లివిటి ఫుట్ గ్రామంలో పర్యటించిన జనసేనపార్టీ నాయకుడు మాదాల శ్రీరాములు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కింద ఇచ్చిన బిల్డింగ్ స్కూల్, బిల్డింగ్ ఉన్న చోట కాకుండా స్కూల్ లేని గ్రామాల్లో నాడు నేడు బిల్డింగ్ ఇచ్చి ఉంటే ప్రయోజనం ఉండేది అని, డుంబ్రిగుడా మండల కేంద్రానికి కొద్ది దూరంలో గ్రామం ఉన్న లివిట్ పుట్ గ్రామంలో పాఠశాల భవనం లేక పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. బ్లాక్ బోర్డు లేక రేకులో ABCD లు అ ఆ లు నేర్పిస్తున్నారు. మట్టితో గోడ నిర్మించి రేకుల షెడ్డులో చదువు చెప్తున్నారు ఏ క్షణంలో షెడ్డు కూలిపోతుందో తెలియదు భయం భయంగా పిల్లల తల్లితండ్రులు పిల్లలకు బడికి పంపడం జరుగుతుంది. స్కూల్ లేదు, మరుగుదొడ్లు లేవు, మంచినీటి సదుపాయం లేదు. విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు. ITDA PO స్పందంచి వెంటనె లివిటిఫుట్ గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని వారు విద్యా శాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు డుంబ్రిగుడా ZPTC అభ్యర్థి కొనెడి చినబాబు, అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొనెడి లక్ష్మణ్ రావు, డుంబ్రిగుడా మండల నాయకులు బంగురు రామదాసు, అల్లంగి రామకృష్ణ, సోబోయి రాజు పాల్గొన్నారు.