పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా.. లక్ష్మణ్ గౌడ్ రెండవ విడత పాదయాత్ర

  • బిజినపల్లి మండలం సల్కర్ పెట గ్రామం నుంచి మొదలైన రెండవ విడత వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర
  • సల్కర్ పెట్ గ్రామంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ చేపట్టిన పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమం బిజినపల్లి మండలం, సల్కర్ పెట్ గ్రామంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా గ్రామ నాయకులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రగా గ్రామంలో పర్యటించి.. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో వంగ లక్ష్మణ్ గౌడ్ కు ప్రజలు వారి సమస్యలు తెలియజేయస్తూ.. డబల్ బెడ్ రూములు అన్నారు.. ఇప్పటికీ ఏదీ లేదు. 3ఎకరాల భూమి అన్నారు.. కనీసం కుంట భూమి కుడా లేని పరిస్తితి ఈ రోజు మాది. దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు అని చెప్పి ఆకరికి ఏ బంధు రావట్లేదు. కొత్త ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు, ఇల్లు కాదు కనీసం బాత్రూంలు కూడా గతి లేదు. ఇప్పుడు కొత్తగా కంటి వెలుగు అంటున్నారు. ఆ వెలుగు కేవలం హోర్డింగ్స్, ఫ్లెక్సీల్లో మాత్రమే కానీ మా జీవితాల్లో వెలుగు ఎమ్ లేదు అయ్యా.. ఓట్ల కోసం మాత్రం వస్తారు, ఆ మాటలు, ఈ మాటలు అన్నీ మయా మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు, గిప్పుడు ఎవ్వడు పట్టించుకోడు అంటూ సల్కర్ పేట గ్రామ ప్రజలు వారి సమస్యలను వంగ లక్ష్మణ్ గౌడ్ కు విన్నవించుకున్నారు. జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల మక్కువ చూపుతూ.. వంగ లక్ష్మణ్ గౌడ్ ను ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, జస్టిన్ బాబా, భోట్క రమేష్, గోపాస్ రమేష్, రాజు నాయక్, సూర్య, మూర్తి నాయక్, రవి, వంశీ రెడ్డి, లింగం నాయక్, సతీష్ గౌడ్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.