Tirupati: అర్ధ రోజు కురిసిన వర్షానికే తిరుపతి పరిస్థితి అధోగతి

మమ్మల్ని ఎవరు అడుగుతారులే అని కార్పొరేటర్ల ఇష్టారాజ్యమా..?

తుఫాను ఉందని ముందుగా తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయకుండా, 50 డివిజన్లలో ఉన్న కార్పొరేటర్లు ఎక్కడా కనిపించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే అన్ని ఇనానిమస్లు చేసుకున్నందువలన ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నారా? తిరుపతి స్మార్ట్ సిటీ నిధులు ఉన్నాయా లేక మీ వ్యక్తిగత అవసరాలకు వాడేసారా?

తిరుపతి చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు, మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు ఈ వర్షాలకు సంబంధించి ప్రజలకు ఏవిధంగా అండగా ఉంటారో తెలియజేయకుండా కనీసం ముందస్తు జాగ్రత్తలను చేపట్టకుండా ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

వెంటనే తుఫాన్ కు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు కావలసిన నిత్యావసర మరియు వసతులను కల్పించి ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ తెలిపారు.