నిరుద్యోగుల‌ను దారుణంగా వంచించిన రాష్ట్ర ప్ర‌భుత్వం: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, నిరుద్యోగుల జీవితాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడుకుంటున్న‌ద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ విమ‌ర్శించారు. గురువారం ప‌ట్ట‌ణంలోని ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, 6100 మాత్రమే రిలీజ్ చేయటం చాలా బాధాకరమని, ఈ విధంగా నిరుద్యోగులను వంచించిన ప్ర‌భుత్వానికి రానున్న ఎన్నిక‌ల్లో బుద్ది చెబుతార‌ని పేర్కొన్నారు. ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కార్ కు ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న క 30వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.