కౌలు రైతులే కాదు పాడి రైతులపై కూడా పగ పట్టిన రాష్ట్ర ప్రభుత్వం

  • పశుగ్రాసం పై రాయితీలు ఎత్తేయడంతో గడ్డుకాలంలో పాడి రైతులు, పాడి పరిశ్రమ

మదనపల్లె, వేసవి రాగానే పశుగ్రాసం ధరలకు రెక్కలు వస్తున్నాయి. పంట పొలాల వద్దకే రైతుల వెళ్లి పొలం విస్తీర్ణం బట్టి పశుగ్రాసం చూసుకొని కొనుగోలు చేస్తున్నారు. 50 సెంట్లు పొలం లోని వరిగడ్డి 20 నుండి 30 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. వేరుశనగ కట్టెలో మంచి పౌష్టికాహారంగా ఉంటుంది. దీంతో గొర్రెలు మేకల యజమానులు వేరుశనగ కట్టె కోసం దూరప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ వేరుశనగ కట్టె 18 వేల రూపాయలు పైబడి ధర పలుకుతోంది .కాగా ట్రాక్టర్ రవాణా చార్జీలు తడిసి మోపెడవుతుంది .
ఆవులు ఎద్దులు 2,76,417 గేదెలు 1,00,588
గొర్రెలు 13,24,325
మేకలు 3,53,350 ఉన్నాయి.
పశు సంపదను కాపాడుకునేందుకు గతంలో ప్రభుత్వం రాయితీపై గ్రాసం దాన ఇతర ఆహార పదార్థాలను అందించేది. ఈ ప్రభుత్వంలో మూడేళ్లుగా అమలు కావడం లేదు. దాంతో రైతులే స్వయంగా కొనుగోలు చేసి పశువులను పోషించుకుంటూ ఉన్నారు. గతంలో 50 శాతం రాయితీపై దాన సరఫరా చేసేవారు, సైలేజ్ గడ్డి ,కరువు దానాలను రాయితీపై ప్రభుత్వం పాడి రైతులకు అవసరమైన మేరకు సరఫరా చేస్తుండేది .పోషక విలువలతో కూడినది కావడంతో పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది .అయితే గ్రాసం పై రాయితీ లేకపోవడంతో మిక్స్డ్ దాన 50 కిలోల సంచి 1200 ఉండగా ఇటీవల బస్తా పై 200 రూపాయలు పెరిగింది. తవుడు 50 కిలోలు 1000 రూపాయలు ఉండగా గత నెల రోజుల్లో 1400 కు పెరిగింది .పశువుల దాన రెండు వందల వరకు ధర పెరగడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది అని మరియు అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.