టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షం

నంద్యాల, టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నంద్యాల నియోజకవర్గ టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి ఎన్.ఎం.డి ఫరూక్, పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్, చందు, గురు, నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని టీడీపి నాయకులు ఏర్పాటుచేసిన ‌సంయుక్త ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్.ఎం.డి ఫరూక్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కూటమి మీటింగ్ ఏర్పాటుచేసి మ్యానిఫెస్టో పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అధికారంలో ఉండగా జగన్‌ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అనంతరం వారు అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించి మన భవిష్యత్తును అందంగా తీర్చు దిద్దుకోవాల్సింది మనమేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు. గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. జగన్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న సంకల్పాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన అభ్యర్ధిత్వాన్ని బలపరిస్తే నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, గురు మాట్లాడుతూ అభివృద్ధికి సుందరీకరణకు తేడా తెలియకుండా, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎమ్మెల్యే శిల్ప రవి ‌చేసిన అనాలోచిత పనులు కారణంగా ప్రజలు నష్టపోవడంతో పాటు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే గోస్పాడు మండలం అభివృద్ధి చేయడం, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధులకు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, సీనియర్ న్యాయవాది, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి, గోస్పాడు నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, గురు సాయి ప్రదీప్ రెడ్డి, బాబా ఫక్రుద్దీన్, రవి, సంజీవ రాయుడు, చిన్న, రమేష్, అధిక సంఖ్యలో స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.