అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. మహేష్ బాబు ఎంత పెద్ద హీరోనో అంతే గొప్ప మనసున్న మనిషి అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ నిజమైన సూపర్ స్టార్ గా నిలిచారు. శ్రీమంతుడు సినిమా తర్వాత రెండు గ్రామాలను దత్తతు తీసుకున్నారుమహేష్. ఆయన సతీమణి నమ్రత ఆ గ్రామాల అభివృద్ధిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అదే విధంగా వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో పసి ప్రాణాలను కాపాడారు మహేష్. తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారికి మహేష్ బాబు అండగా నిలిచారు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతుంది. చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించారు. ప్రస్తుతం ఆ పాప కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవారి నుంచి ప్రారంభం కానుంది. అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.