నేటి నుండి పూర్తిస్థాయిలో పని చేయనున్న సుప్రీం కోర్టు

కొవిడ్-19  కారణంగా గత ఏడు నెలలుగా కేవలం 5 బెంచ్‌లతోనే వర్చువల్​గా పని చేసిన సుప్రీం కోర్టు.. నేటి నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా 30 మంది న్యాయమూర్తులతో కూడిన అన్ని బెంచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే..  దేశంలో కరోనా కారణంగా భౌతిక విచారణలు ప్రారంభించకూడదని నిర్ణయించింది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ మార్చి 23 నుంచి ఉన్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను విచారిస్తోంది. సోమవారం ఎనిమిది బెంచ్‌లకు ముగ్గురు న్యాయమూర్తులు, మరో రెండు ద్విసభ్య, రెండు సింగిల్‌ జడ్జి బెంచ్‌ల న్యాయమూర్తులను వాదలు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విననున్నారు. బదిలీ పిటిషన్లను వినడానికి, నిర్ణయించడానికి రెండు సింగిల్ జడ్జిల బెంచీలు ఉండనున్నాయి. దేశంలో మహమ్మారి కారణంగా తగినంత ప్రజా రవాణా సౌకర్యాలు లేకపోవడం సహా వివిధ కారణాలతో తక్కువ సంఖ్యలో సిబ్బందితో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పని చేస్తోంది.