వైసీపీ కి ఓటు వేసి తప్పు చేశామని చెప్పులతో కొట్టుకొని నిరసన తెలిపిన గిరిజనులు

అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం.. అధికార వైసీపీ నాయకులకు ప్రచారాల మీద ఉన్న యావ ప్రజల కనీస అవసరాలు తీర్చడం మీద అస్సలు ఉండడం లేదు. మామూలు ఎమ్మెల్యే లు అంటే పనులు అవ్వవు అనుకోవచ్చు.. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సొంత మండలంలో కూడా రోడ్లు లేకపోవడం సిగ్గుచేటు. అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామంలో రోడ్లు లేవని గిరిజనులు “వైసీపీ కి ఓట్ వేసి తప్పు చేశామని చెప్పులతో కొట్టుకొని నిరసన తెలిపారు”. ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా.. ఇప్పటికే చాలా చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. గిరిజనులు కోరుకుంటున్న న్యాయమైన కోర్కెలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.