రాష్ట్ర ప్రగతికి బడ్జెట్ లో ఏమాత్రం తావివ్వని వైకాపా ప్రభుత్వం: పెండ్యాల శ్రీలత

అనంతపురం, బుధవారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 24వ రోజు అనంతపురం రూరల్ పంచాయతి బైరవనగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమయ్యి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అష్టకష్టాల్లో ఉంటే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు, ప్రజలు భావించారని, కానీ వారు నిరాశపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొల్లతనంగా ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారు తప్ప రాష్ట్ర గతి,ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. స్పష్టమైన అభివృద్ధి నమూనాను ఆవిష్కరిస్తారని ఆశించిన వారికి బడ్జెట్ నిరుత్సాహపరిచిందని దుయ్యబట్టారు. రెవెన్యూ రాబడులకంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా చూపిన ఈ బడ్జెట్ లో ధరలు మరింతపెరిగి మధ్యతరగతి ప్రజల వినియోగంపై మరింత భారం పడే అవకాశముందని అప్పులు తెచ్చి నడిపే పథకాలు తప్ప ఆదాయ సృష్టి జరిగే మార్గం చూపలేదని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో కీలకమైన అన్ని రంగాలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని జగన్ రెడ్డి వ్యక్తిగత బడ్జెట్ అని ఆమె విమర్శించారు. వీటితో పాటు ఇక్కడ స్థానికంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర గతిని మార్చి ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలంటే జనసేన-టీడీపీ పార్టీలకు ప్రజలు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.