అత్యంత వైభవంగా జరిగిన శ్రీ త్రిమూర్తుల స్వామివారి కళ్యాణ మహోత్సవములు

రాజానగరం నియోజకవర్గం, నరేంద్రపురం గ్రామంలో శ్రీ త్రిమూర్తుల స్వామివారి 76వ కళ్యాణ తీర్థ మహోత్సవానికి కమిటీ వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు. ఈ మహోత్సవం లో స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు బత్తుల దంపతులకు సాధర స్వాగతం పలుకుతూ, దుశ్శాలువ తో సత్కరించి, పూలమాలలు వేసి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలసి ఆలయ గర్భగుడిలో త్రిమూర్తులు స్వామివారిని ప్రత్యేకం గా దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించే స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురువారం ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం జరిగిన అన్నసమారాధన లో స్థానిక ప్రజలతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. కళ్యాణ మహోత్సవం ఆఖరి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళానృత్యాలు కమిటీ వారు ఏర్పాటు చేశారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ శ్రీ త్రిమూర్తుల స్వామివారి కృపా కటాక్షలతో, చల్లనిదీవెనలు అందరిపై ఉండి, అందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్రపురం గ్రామ పెద్దలతో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.