ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేహక్కు ను హరిస్తున్న వై.సీ.పీ ప్రభుత్వం

బుధవారం మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కోసం 5 వేల మంది విద్యార్థులతో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని బలవంతంగా అధికార దుర్వినియోగంతో అడ్డుకోవడాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల యాజమాన్యానికి నోటీసులిచ్చి మీరు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని నోటీసులు పంపించి భయభ్రాంతులకు గురిచేయడం అధికారులకు తగని పని. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. దయచేసి అధికారులు కూడా సహృదయంతో అర్థం చేసుకొని మదనపల్లి ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలని లేదంటే చరిత్రహీనులు అవుతారు అని మదనపల్లి సాధన సమితి జేఏసీ తరఫున మరియు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.