వి.ఆర్.ఏలకు సంఘీభావం తెలిపిన విడివాడ

తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి లో గత 15 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న వి.ఆర్.ఏలను తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఈ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం జగన్ మోహనరెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలమేరకు వి.ఆర్.ఏల యొక్క న్యాయమైన కోరికలను తీర్చాలని జనసేన పార్టీ తరపున కోరడమైనది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సభ్యులు దిరిశాల వెంకట్, అత్తిలి మండలం పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, తణుకు మరియు ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు, అత్తిలి జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.