పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్న యువత

  • దేశానికి వెన్నెముక యువతే
  • కిరణ్ రాయల్

తిరుపతి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ, సిద్ధాంతాలు నచ్చి స్థానిక ఎంఆర్ పల్లి, రాయల్ నగర్, సప్తగిరి నగర్ల నుంచి సుమారు ముప్పై మందికి పైగా యువత సుధాకర్, హరి, సురేశ్ రాయల్, ముని, మోహన్, చంద్ర, క్రాంతి, దీపక్, శంకర్, కిషోర్, కుమార్, లక్కీ, ప్రసాద్, నవీన్, రాజేష్, సోమేష్, ప్రదీప్, రాము, దిలీప్, ప్రశాంత్, నరేష్, వెంకీ, బాలాజీ, ఉదయ్, చంద్ర, ముభారక్, అరుణ్, హేమంత్, మధుకర్, రామకృష్ణ, చంద్ర, వెంకటేష్, రామ్ తదితరులు తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బైరాగి పట్టేడ పార్టీ ఆఫీసునందు వారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుపతితో సహా రాష్ట్రంలో యువతీ, యువకులు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ, సిద్ధాంతాల నచ్చి ప్రతినిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో జనసేనలో యువత చేరికలు కొనసాగుతున్నాయని, ఈ దేశానికి వెన్నెముక అయిన యువత రాజకీయాల్లోకి రావాలని, అవినీతిని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఉపాధ్యక్షుడు బాబ్జీ, ప్రధాన కార్యదర్శి కొండా రాజా మోహన్, కిషోర్, హిమవంత్, సాయి దేవ్, మనోజ్, షరీఫ్, వంశీ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.