గంగోలు, సగ్గొండ పంచాయితీలలో మద్దిపాటి వెంకటరాజు ఇంటింటి ప్రచారం

గోపాలపురం నియోజకవర్గం: గంగోలు పంచాయితీ, సగ్గొండ పంచాయితీ గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్ధి మద్దిపాటి వెంకటరాజు చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. ప్రచారంలో బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించి చెప్పారు. దానిపై గ్రామ ప్రజల దగ్గర నుంచి మంచి విశ్లేషణ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో అభ్యర్ధి వెంకటరాజుతో జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు, హుకుంపేట శ్రీమంతుడు హోతా రాజా, బీజేపి కన్వీనర్ వాసు, జనసేన పార్టీ గోపాలపురం మండల అధ్యక్షులు రాజేంద్ర, ఉపాధ్యక్షులు గణపతి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రొంగా సత్యనారాయణ, జనసేన పార్టీ హుకుంపేట గ్రామ అధ్యక్షులు ఫణి, కొవ్వురుపాడు గ్రామ అధ్యక్షులు రాంబాబు, గోపవరం గ్రామ అధ్యక్షులు రాజేష్, భీమోలు గ్రామ అధ్యక్షులు ఉమా మరియు తదితర మూడు పార్టీల నాయకులు, శ్రేణులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.