గిరిజన ప్రాంతాల్లో డ్రైనేజ్, మంచినీటి సమస్యలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

  • జనసేనపార్టీ మండల అధ్యక్షులు జాగారపు పవన్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం పరిధిలోని సిరిసపల్లి గ్రామంలో, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పవన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జాగారపు పవన్ కుమార్ మాట్లాడుతూ పేదలకు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శిరీష పల్లి గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురౌతున్నారు. ఇక్కడ మంచినీటి సౌకర్యం లేక, నీరు కలుషితం కారణంగా అనేక మంది అనారోగ్యాలకు గురిఅవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రజలకు దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే గ్రామంలో అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ముక్తకంఠంతో పని చేస్తాం అని తెలిపారు. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సమస్య వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజనులకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి బజన వేయడానికి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ రోజు మీరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో గిరిజనులు సమస్య ఉంది అని జనసేన పార్టీ తెలపడం చాలా బాధాకరం. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాను అని అధికారం లోకి వచ్చిన మీరు ఆ పదవికి అనర్హులు అని తెలిపారు. తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని, గిరిజన అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సమస్య నెరవేర్చాలేని, మరుక్షణం నిరసన కార్యక్రమం ఉద్రిక్తం చేస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సిరిసపల్లి గ్రామంలో అనేక సమస్యల మీద దృష్టి పెట్టి నిజాయితీగా పనిచేస్తాం అని తెలిపారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో తెలియజేశారు. అలాగే గిరిజన అభివృద్ధికి మార్పుకి శ్రీకారం చుట్టి జనసేన అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వవలసినదిగా కోరడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రజలు జనసేన పార్టీకి ఘనంగా ఆహ్వానం అందడంతో పవన్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి ప్రజలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల నాయకులు, జనసైనికులు అనేక మంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.