తాసిల్దార్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి: పవన్ కుమార్

అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తాసిల్దార్ మృతికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మండల జనసేన అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో మైదాన ప్రాంతం నుంచి వచ్చి విధి నిర్వహణ చేస్తున్న అధికారులకు పని ఒత్తిడి ఎక్కువ కారణంగా తాసిల్దార్ ఆత్మహత్యకు ప్రధాన కారణమని చెప్తున్నారు.. ఏమైనప్పటికి ఒక ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఈ సంస్కృతి పాకిపోవడం అంత మంచిది కాదు, నేరస్తులు ఎవరైనా నేరస్తులుగానే పరిగణించాలి. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఉద్యోగులే ప్రధాన కారణమా?..లేక దీనివెనుక ఎవరైనా ఇంకా ఉన్నారా..? ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. ఇంటిదిక్కు కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోజు రోజుకి రెవిన్యూ శాఖ ప్రతిష్ట దిగజరుతోంది. రెవిన్యూ శాఖ లోనే అవినీతి ఎక్కువగా ఉందన్నది ప్రజలకి బహిరంగ సత్యం. నిజాయితీగల ఉద్యోగులు సైతం తమకు తెలియకుండానే సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. నానాటికి ఉద్యోగుల్లో అభద్రత భావం, నిజాయితీ లోపిస్తుంది. వీటికి మూలాలు ప్రభుత్వపాలనతీరు ఏదీ ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కుమార్ జాగరపు తెలిపారు.