ముద్రగడ వ్యాఖ్యలను ఖండించిన తోట లక్ష్మీనారాయణ

  • ద్వారంపూడి చంద్రశేఖర్ ‘రెడ్డి’ మీద విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ ని వీధి రౌడీలా మాట్లాడుతున్నావని ఉద్భోదించిన ముద్రగడ పద్మనాభం ఇదే రెడ్డి పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు ఏం చేస్తున్నారు?
  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం చేసిన అవగాహన లేని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.

సత్తెనపల్లి, ముందుగా ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ మాటలు మీకు నచ్చక రాసిన లేఖ ప్రారంభంలో ప్రముఖ సినీనటులు అని ఎందుకు రాశారు ? కేవలం సినిమాలకు పరిమితం చేద్దామని మీ ఉద్దేశ్యమా ? 2019 ఎన్నికల్లో 10 వ షెడ్యూల్ సవరణ ద్వారా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జనసేన హామీ ఇస్తే ఎందుకు మీరు మద్దతు తెలపలేదం? కాపు రిజర్వేషన్ నా చేతులో లేదు అని చెప్పినా సరే ఎందుకు జగన్ రెడ్డి పల్లకి మోసారండి? రాచరిక మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డికి బొత్సా, పిల్లి బోస్ లాంటి వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని ఎలా అడిగారు ? ఇన్నేళ్ల అనుభవంలో ఈ మాత్రం అర్దం చేసుకోలేకపోవడం బాధ కలిగించింది. తండ్రి శవం దగ్గర ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు సేకరించిన వ్యక్తిని ఎలా అడిగారు ? పవన్ కళ్యాణ్ మాటలు నచ్చడం లేదు అన్నారు, మరి ద్వారంపూడి మాట్లాడిన మాటలు కమ్మగా ఉన్నాయా ? వాళ్ళు తిడితే పడమంటారా ముద్రగడ ? మీకు మంత్రి పదవి వచ్చేలా చేసారనో, మీ ఇంటి శుభ కార్యాలకు వచ్చినంత మాత్రాన మహానుభావుడు అయిపోరు, రౌడీ ఎప్పటికీ రౌడీ అనే అంటారు. మీటింగులకు లారీలు, వాల్ పోస్టర్లకు డబ్బులు ఇచ్చారని ప్రజల నోట్లో మట్టికొడతా అంటే చూస్తూ ఉండలేం ముద్రగడ. ఎందుకండి ఎప్పుడు కాపులు ఏకమైనప్పుడు వైసిపి నష్టం జరిగేప్పుడు వచ్చి లేఖలు రాస్తారండి. స్వర్గీయ వంగవీటి రంగాని చంపించారు అని చెప్పే అదే తెలుగుదేశం పార్టీతో మీరు ఎందుకు కాపురం చేసారు. 2004లో కూడా ఎంపిగా టిడిపిలో ఉంది పోటీ చేశారు అది గుర్తుందా మీకు కానీ జనసేన పొత్తు పెట్టుకోవాలనుకుంటే మాత్రం కాపులకు అన్యాయం చేసినట్లు ఉద్దేశం ? మరో ముఖ్యమైన విషయం కొంతమంది కాపు నాయకులు వాళ్ళ స్వార్ధయానికి పనిచేస్తున్నారు అనగానే, మీ పేరు చెప్పకపోయినా ఎందుకండి మీరు భుజాలు తడుముకుంటున్నారు ? ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ ఒక్క కులానికి మాత్రమే కాదండీ అన్ని కులాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు వంగవీటి రంగా కూడా అన్ని వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అవునా కాదా చెప్పండి, కానీ కొంతమంది మీలాంటి వారు ఆయనను కాపులకు పరిమితం చేసారు . ఈసారి అలా జరగదు ముద్రగడ ఇంతకు మించి చెప్పడానికి ఏమి లేదు. మరోసారి మరో లేఖతో రాకుండా మీ కాపు నాయకుడిగా మీ పెద్దరికం నిలబెట్టుకోవాలని అనుపాలెం గ్రామ జనసేన పార్టీ అద్యక్షులు తోట లక్ష్మి నారాయణ అన్నారు.