గ్రావెల్ అక్రమ రవాణా అడ్డుకుంటే బెదిరింపులా?

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు గ్రామం దత్తంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్థానికులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. వైసిపి నాయకులు నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ స్థానిక గిరిజనులపై దాడికి యత్నించారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్థానిక పోలీసులు ఇద్దరినీ సమన్వయపరిచారు. శనివారం కొడవలూరు పోలీస్ స్టేషన్లో గ్రామస్తులందరూ కలిసి గ్రావెల్ అక్రమ రవాణాపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మొన్న మీరు వచ్చి జనసేన పార్టీ తరఫున గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నించటం చూసి ధైర్యంగా గ్రావెల్ రవాణాను నిలిపాము. ఆడోళ్ళతో కూడా పచ్చి బూతులు మాట్లాడుతూ యానాదులు మీకెందుకురా ఈ గొడవలు అని తిట్టిపోశారు. మేము చల్లా యానాదులమే మమ్మల్ని చంపి మా శవాల మీద ఈ గ్రావెల్ తీసుకొని పొండి అని మేము మొండిగా నిలబడ్డాము. ప్రాణం పోయినా ఇక్కడి నుంచి లారీ పోనివ్వము. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాము వైసిపి నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. మా ఇల్లు ఖాళీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. న్యాయపరంగా పార్టీ తరఫున మీరు అండగా నిలబడాలి అని జనసేన నాయకులు గునుకుల కిషోర్, సుధీర్ బద్దెపూడిని కోరారు. జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని న్యాయపరంగా గిరిజనులకు అండగా ఉండి జరగతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని జనసేన నాయకులు తెలిపారు.