మూడు రాజధానుల పేరుతో మూడేళ్ళ కాలయాపన: కీర్తన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ కీర్తన మాట్లాడుతూ… అధికారంలోకి రాకముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఓట్లను సంపాదించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మే స్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేయడమే కాకుండా చీప్ లిక్కర్ అమ్ముతూ మద్యం తాగేవారి జీవితాలతో చెలగాటమాడారు. మద్యం పైన 25 వేల కోట్ల అప్పు చేశారని అమరావతి రాజధానిగా మద్దతు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మూడేళ్ళ కాలయాపనతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పడం జరిగిందని పిఆర్సి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను నయవంచన చేసి న్యాయం చేయలేక పోయారని మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పెంచుతాం అని చెప్పి మూడు సంవత్సరాల కాలంలో కేవలం 500 రూపాయలు మాత్రమే పెంచాలని, ఓటిఎస్ పథకం పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, అత్యధిక సీట్లు ఇచ్చిన రాయలసీమ ప్రాంత వాసులకు పరిశ్రమలు తెస్తామని చెప్పి వారిని కూడా మోసం చేశారని ఇచ్చిన హామీలను నిలబెట్టకపోగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ఐతేనేమి సిమెంట్ ధరలు అయితే నేమి ఎన్నో విషయాలపై స్పందించాల్సి ఉంది పోయి కేవలం సినిమా టికెట్ ధర పై ప్రభుత్వం స్పందించడం హాస్యాస్పదంగా ఉందని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షాన జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతామని వారు తెలియజేశారు.