పులి వేట మా పవన్ కళ్యాణ్ ఆట ఆపడం ఎవ్వరితరం కాదు..!

*భీమ్లా నాయక్ సినిమా సెలెబ్రేషన్ లో మాకినీడి శేషుకుమారి వ్యాఖ్య

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవల విడుదలై ఘనవిజయం సాదించడంపై పట్టణ పవన్ ఫాన్స్, జనసైనికులు, నాయకులు విజయవోత్సవ వేడుకలు అట్టహాసంగా ఏర్పాటు చేయగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిధిఆ పాల్గొని అభిమానుల మధ్య కేక్ సట్ చేసి సెలెబ్రేషన్ సంబరాలు అంబరానికి అంటాయి. ఈ విజయోత్సవాన్ని ఉద్దేశించి శేషుకుమారి మాట్లాడుతూ… మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైవిధ్యమైన కేరేక్టర్లతో ప్రేక్షకులను అలరించడంతోపాడు సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారు. ప్రతీసినిమా సమాజం మార్పుకు ఉపయోగపడే కథను ఎన్నుకునే తీరు అమోఘమని సినిమాలోనే కాక రాజకీయల్లో తనదైన స్టైల్లో రాజకీయా మార్పులు తేవడానికి చేసేకృషి అద్బుతంగా ఉందన్నారు. నిత్యం మార్పు కోసం పరితపించే పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని అణచవేయాలనే ఆలోచనతో టిక్కెట్లు ధరలు తగ్గించడం సినిమాను తప్పు పట్టడంలాంటివి చేసి మాఅధినేత పాపులర్ తగ్గించాలని దుష్ట శక్తులు అంచనాలు పటాపంచలైయ్యెలా భీమ్లా నాయక్ విజయాన్ని ప్రేక్షేక దేవుళ్ళు అందించారని అందుకే అంటున్నాను పులితో వేట పవన్ కళ్యాణ్ ఆట ఆపడం ఎవ్వరుతరం కాదని ఆయన అవినీతి పరులకు ఆరడుగుల బుల్లెట్లా దోపిడిదారులకు కొమరంపులిలా , అక్రమదారులకు పులి పంజాలావిరుచుకుపడే భీమ్లా నాయక్ అని ప్రజల మాత్రంకృషినింపే పవన్ మాబంగారం అని కొనియాడుతున్నారని అలాంటి మాఅధినేత పై పేర్ని నానీ కొడాల నాని లాంటి కొంత మంది మంత్రులు తప్పుడుగా మాట్లాడే విధానం మాను కొకపోతే జనసైనికు లే బుద్ది చేబుతారని ఆమె అన్నారు అలాగే క్రియాశీలక సభ్యత్వం గత నెల 21వ తారీకు నుంచి ప్రారంభమయ్యే మార్చి నెల 7వ తారీఖు వరకు నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రతి వాలెంటర్ పార్టీ కోసం కృషి చేసే జనసైనికులు నాయకులను గుర్తించి సభ్యత్వం ఇవ్వాలని ప్రతి గ్రామంలో ఈ క్రియాశీల సభ్యత మీద అవగాహన కలిగించి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి జనసైనికుడికి భరోసా ఆ కుటుంబానిమ్మొ ఆదుకోవడంలో పెద్ద అన్నయ్య అండగా ఉండి ఇటువంటి కార్యక్రమం ఏ పార్టీ ఇప్పటివరకు చేయలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల బాబురావు(మూర్తి), బుర్రా సూర్య ప్రకాష్, మేళం బాబి, అశోక్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, యండ్రపు శ్రీనివాస్, తోట సతీష్, కందరాడ ఎంపీటీసీ పిల్లా దినేష్, మొగిలి శ్రీనివాస్, వాకపల్లి సూర్యప్రకాష్, మోటూరి మహేష్, పెనుకొండ వెంకటేశ్వరరావు, పెనుగొండ సోమేశ్, నామ శ్రీకాంత్, గంగుముళ్ళ మణికంఠ, అనిల్, శిరీష, నాయకులు, జనసైనికులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.