ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తిరథ్ సింగ్ రావత్అధికారిక ప్రకటన

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ (60) తన పదవికి రాజీనామా చేయగా.. ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లెజిస్లేచర్ మీటింగ్‌లో ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పాలనపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.