తిరుపతి మోటార్ వెహికల్స్ కార్మికులు ‘నా సేన కోసం.. నా వంతు’

తిరుపతి, జనసేన అధినేత పిలుపుమేరకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతిలో ఉన్న మోటార్ వెహికల్స్ కార్మికులను మమేకం చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న మోటార్ వెహికల్స్ కార్మికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించి వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.