కరోనా వైర్‌సను నెమ్మదించేoదుకు: బీసీజీ వాక్సిన్
ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న కరోనా వైర్‌సను నెమ్మదించేoదుకు క్షయ వ్యాధి నివారణకై వినియోగించే బీసీజీ వాక్సిన్ ఉపయోగపడుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ పరిశోధన కోసం.. కరోనా ప్రవేశించిన తొలి నెలరోజులకు 135 దేశాల్లో పాజిటివ్ కేసుల్ని, 134 దేశాల్లో మరణాల శాతాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పుట్టిన 15రోజుల లోపు శిశువులకు ఇచ్చే బాసిలస్ కాల్మెటీ-గుయెరిన్(బీసీజీ) వాక్సిన్ క్షయ నివారణతో పాటు వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వాక్సిన్ తప్పనిసరిగా వాడుతున్న దేశాల్లో కరోనా ప్రవేశించిన తొలి 30రోజుల్లో నెమ్మదిగా వ్యాప్తి చెందడమే కాక, మరణాల శాతం కూడా తక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న అన్ని దారులను ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీజీపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనాకు బీసీజీ పరిష్కారమా అన్న ప్రశ్నకు మరో రెండు లేదా మూడు నెలల్లో సమాధానం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.