నేడు భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భద్రాచలం రామయ్య సన్నిధిలో నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం తాత్కాలిక పుష్కరిణిలో లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం ఉదయం 5 ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి భక్తులు లేకుండానే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొవిడ్‌ కారణంగా భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణాలను నిలిపివేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో ఆలయాన్ని అలంకరించారు.