నేడు ప్రధాని మన్‌ కీ బాత్‌

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ ఏడాదిలో తొలి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టే ముందు రోజు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వైరస్ మహమ్మారి మధ్య సోమవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ 73వ ఎపిసోడ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాని చివరి ఎపిసోడ్‌లో భారతదేశం తయారు చేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని చెప్పారు. ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ నినాదానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. భారతీయ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని పారిశ్రామికులకు పిలుపునిచ్చారు. దేశ పురోభివృద్ధికి కొత్త సంవత్సరంలో తీర్మానాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ దైనందిన జీవితంలో మరిన్ని స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిద్దాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.