ట్రైలర్ టాక్: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. పక్కా హిట్

యాంకర్ గా బుల్లితెర ఫై సందడి చేస్తూ వస్తున్న ప్రదీప్ మాచిరాజు.. ఇప్పుడు వెండితెర ఫై హీరో గా సందడి చేసేందుకు వస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం లో ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా కు కూడా డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

ఇప్పటికే ఈ చిత్రంలోని ఒక్కో పాట విడుదలవుతూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై మరింత ఆసక్తి పెంచారు. లవ్ రొమాంటిక్ గా సాగిన ఈ ట్రైలర్.. ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనేది ట్రైలర్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.