మోడల్‌ స్కూల్స్‌ టీచర్ల బదిలీలు చేపట్టాలి

ప్రోగ్రెసివ్‌ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని పాఠశాలలకు కలిపి దాదాపు 3వేల మంది టీజీటీ, పీజీటీలుగా పనిచేస్తున్నారని.. బదిలీలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్‌, ప్రధాన కార్యదర్శి అనుములు పోచయ్య తెలిపారు.

అయితే గత ఏడాది ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలను గత ఏడాది పూర్తి చేసిన విద్యాశాఖ.. మోడల్‌ స్కూళ్లను మాత్రం విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టి, ఉపాధ్యాయులకు ఊరట కలిగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.