రోజా బర్త్‌డే వేడుకలు..

సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక రోజా పుట్టినరోజు వేడుకలు ఆమె ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రోజా భర్త సెల్వమణి, కుమారుడు, కుమార్తెతో పాటు పలువురు బంధువులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా.. అందులో రోజా అందరినీ ఆకట్టుకుంటున్నారు.