వాస్తవాలు గిరిజన ప్రజలు గుర్తించాలి.. చిట్టం మురళి

పాడేరు: అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయితీ శంకుపర్తి గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం అమాయక ఆదివాసీ రైతుల నుంచి జిరాయితి పట్టాలు గుంజుకుని అక్రమంగా సంతకాలు చేపించుకుని, సంతకాలు పెట్టని అమాయక ఆదివాసీ సుర్ర తమ్మయ్యపై ధౌర్జన్యం చేసి కొట్టించి పరోక్షంగా ఆ వ్యక్తి మరణానికి కారకులై ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభరవిబాబు, అతని అనుచరులు. ఆ గ్రామంలో సంబంధించిన భూ ఆక్రమణకు అప్పట్లో వ్యతిరేకించే సాహసం చేయలేకపోయినా గిరిజన ప్రజలు ఇప్పుడు గ్రామ యువకుల సహాయంతో ధైర్యం చేసుకుని స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేసారు. ఫలితంగా జులై 15వ తేదీన జిల్లా కలెక్టర్ అఫిస్ లో సంబంధిత పిర్యాదుదారులు హాజరు కానున్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న భీమ్ పోలు గ్రామవాసి చంద్రమోహన్, భీమ్ పోలు గ్రామవాసి, గద్యగూడా వాసి కుంభరవిబాబు లను ఈ భూ ఆక్రమణలో ప్రధాన నిందితులుగా పిర్యాదు దారులు పేర్కొన్నారు. అయితే గతంలోనే ఎస్టీ కమిషన్ చైర్మన్ పై అక్రమమైనింగ్ ఆరోపణలున్న మాట అందరికి తెలిసిందే. కొందరు గిరిజనులు వాళ్ళు ఇచ్చే చిల్లరకు అలవాటు పడి బినామిలుగా వ్యహరిస్తున్నమాట గిరిజన ప్రజలందరికీ తెలిసిన విషయమే. పైగా సాక్ష్యాధారలేవి అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు ఎదురు దాడి చేయడం బాగా పరిపాటి అయ్యింది. పెద్దల ముసుగులో తోటి గిరిజనులకు అన్యాయం చేస్తున్న మేకవన్నె తోడేలు వంటి వ్యక్తులను గిరిజనులు గుర్తించనంత కాలం గిరిజనులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా వాస్తవాలు పాడేరు, అరకు నియోజకవర్గాల గిరిజన ప్రజలు గుర్తించాలి రానున్న న్యాయ విచారణలో అమాయక ఆదివాసీ ప్రజలు గెలుస్తారు భూ అక్రమార్కులకు, మైనింగ్ దొంగలకు వేరే ఏ శిక్షలు పడక పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నేర చరిత్ర ఉన్న నాయకులను ప్రజాస్వామ్య రాజకీయాలలో నాయకులుగా ఎన్నుకునేటప్పుడు గిరిజన ప్రజలు కనీస విచక్షణతో ఆలోచించాలని మనవి చేస్తున్నామని చిట్టం మురళి తెలిపారు.