చౌడువాడ పంచాయతీలో అంబేద్కర్ కు ఘననివాళి

మాడుగుల, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మాడుగుల నియోజకవర్గ కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయతీలో కె. కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు పూలమాల వేసి అదే పంచాయతీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజల్లోనే కాదు ప్రజా ప్రతినిధుల్లో కూడా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉందని వాళ్ళ నోటి వెంట వచ్చిన మాటలు తెలియజేస్తున్నామని అన్నారు. గ్రామ సభలో గ్రామంలో అందుబాటులో లేని సేవలు గురించి అందుబాటులో ఉన్న సేవలు పనితనం గురించి ప్రశ్నించడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ప్రశ్నించిన ప్రశ్నలకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సత్వరమే అమలయ్యే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది.