గుండ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ కు ఘననివాళి

సత్తెనపల్లి, భారత దేశ రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయులు భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో జనసేన పార్టీ నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి గుండ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.