మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళులు

మదనపల్లె: డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ 67వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి జనసేన కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ మరియు జనసేన నాయకులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్‌కి పూర్వం, అంబేడ్కర్‌ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్‌ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకురాలు రూప, మదనపల్లి విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, నాయకులు కుప్పాల శంకర, ధరణి, యాసిన్ షేక్, గణేష్, నాని, అబ్దుల్ మాజిద్, కాజా తదితరులు పాల్గొన్నారు.