లక్కవరపుకోట జనసేన ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘననివాళి

శృంగవరపుకోట, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలో జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమజ్వాజ్ పార్టీ ఈశ్వరరావు, సెర్చ్ కమిటీ సభ్యులు రామెల్ల శివాజీ మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి మహనీయుల భావజాలం ఆశయాలను ప్రతీ పౌరుడు మార్గదర్శంగా తీసుకుని నవసమాజ సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ ఎల్.కోట సెంటర్లో గల విగ్రహానికి ఇనుప నిచ్చెనని నిర్మిస్తామని హామీ ఇవ్వగా నియోజకవర్గ నాయకులు పెడిరెడ్ల రాజశేఖర్ కూడా ఎల్.కోట ఎస్సి కాలనీలో గల అంబేద్కర్ విగ్రహం కార్యక్రమంలో విగ్రహానికి ఇనుప నిచ్చెన బహుకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సూరి దేముడు అప్పారావు గానివడ అప్పారావు, మరియు జనసేన నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, రాంబాబు, మధు, చంటి నక్కరాజు సతీష్, గాలి అప్పారావు, వీరమహిళ వెంకట లక్ష్మి పాల్గొన్నారు.