పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు

గాజువాక: పుల్వామా దాడి జరిగి నేటికి నాలుగేళ్లు, ఈ సందర్భంగా గాజువాక జనసేన పార్టీ భారత్ జనసైనిక్స్ టీం సభ్యుల ఆద్వర్యంలో పుల్వామా అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నాలుగేళ్లు అయింది. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన 40 మంది భారత జవాన్లు అమరులైన నాలుగేళ్ల తర్వాత కూడా జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఫిబ్రవరి 14వ తేదీ భారతదేశానికి ఒక బ్లాక్ డే, 40 మంది వీరజవాన్లు, పుల్వామా సెక్టార్ లో ముష్కరులు చేసిన బాంబు దాడి ఘటనలో ప్రాణాలను అర్పించారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం భారత్ జనసైనిక్, జనసైనికులు బి కే దుర్గ, రవీంద్ర, అప్పు, కనకేశ్వర, రామారావు, స్వరాజ్, భాస్కర్, వీరమహిళ శాలిని ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.