ఉద్యమ నేత గద్దర్ కి ఘన నివాళులు
పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యర్యంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నేత గద్దర్ కి పాలకొండ జనసేన నాయకులు జనసైనికులు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మూగబోయిన ఉద్యమ గళం దళిత రచయిత గద్దర్ అందరికీ సుపరిచితమైన వ్యక్తి ప్రముఖ విప్లవ కవి ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచిపెట్టడం చాలా బాధాకరమైన విషయం గద్దర్ బడుగు బలహీన వర్గాలు వారు బీసి, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకి చెందిన పేదలు అనుభవిస్తున్న కష్టనష్టాలను ఆయన ఆయన బృందం తమ ఆటపాటలతో కళ్ళకు కట్టినట్టులు చూపించేవారు. ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చాయి గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఆయన రాసిన పాటల్లో ఎన్నో ఉద్యమ గీతాలను రచించి ఆడి పాడి ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిలించిన అమరవీరుడు గద్దర్ అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తుంది అని పాలకొండ నియోజకవర్గ నాలుగు మండల జనసేన నాయుకులు, జనసైనికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఘన నివాళులర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-07-at-22.33.55-1024x456.jpeg)