గిరిజన గ్రామాలలో పర్యటించిన జనసైనికులు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం: సీతంపేట మండలం జనసైనికులు జనసేన పార్టీ బలోపేతం దిశగా.. ప్రతీ గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా కొండప్రాంతాల్లో ఉంటున్న, గిరిజన గ్రామాలైన పెద్దగూడ, రామనగరం లను సందర్శించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది.. అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరించి.. పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విశ్వనాథం, ఉపేంద్ర, దుర్గారావు, రవి, జనసైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.