కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా త్వరలో టీఆర్ఎస్ ఉద్యమం

మంత్రి హరీష్ రావు కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు . కాంగ్రెస్ వాళ్ళు పరాయి లీడర్లు, పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఉండగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బీజేపీ వాళ్ళు అన్నారన్నారు. వ్యవసాయం దండగని కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ అన్నారని తెలిపారు. కాలిపోయే మోటార్లు కావాలా, బావి దగ్గర మీటర్లు కావాలా, 24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలను అడిగారు మంత్రి హరీష్.

27ఏప్రిల్ 2020 నాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లు తెచ్చింది.17 మే సబ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాలి అని కేంద్రం రాష్ట్రానికి లెటర్ రాసింది. బావిల దగ్గర మీటర్లు పెడితే 2500 కోట్లు ఇస్తామన్నారు. కానీ జూన్ 2 మీటర్లు పెట్టము అని సీఎం కేంద్రానికి లెటర్ రాశారు. మీటర్లు వద్దు అంటే 300 మీటర్ల లోత లో బీజేపీని పాతి పెట్టాలి అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లో పంట ఎండకుండా ఎప్పుడు అయిన పండిందా అని ప్రశ్నించిన ఆయన ముత్యం రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 30 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారు అన్నారు. అలాగే విదేశీ మక్కలు తెస్తే ఇక్కడి మక్కలు ఎవరు కొంటారు. ఎవరి ప్రయోజనాలు కోసం బీజేపీ ఈ పని చేస్తుంది అబద్ధాల పునాదిల మీద బీజేపీ , కాంగ్రెస్ లు ఓట్లు పొందాలని చూస్తున్నాయి అన్నారు.