వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ట్రంప్ అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించారు. వాషింగ్టన్ లో ఘర్షణలు చోటుచేసుకోనున్నాయన్న ఎఫ్‌బిఐ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైట్ హఔస్ మీడియా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

గత బుధవారం యూఎస్ కాంగ్రెస్ సభ్యులు సమావేశమైన క్యాపిటల్ బిల్డిం పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పొగా, ఆస్తులు ధ్వంసమయ్యాయి. బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు కూడా విధ్వంసం జరిగే అవకాశముందని సమాచారం అందడంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జనవరి 24వ తేదీ వరకు ఎమర్జెన్సీని ప్రకటించి, అల్లరు కాకుండా చర్యలు తీసుకున్నారు. వాషింగ్టన్ కాకుండా దేశంలోని 50 రాష్ట్రాల క్యాపిటల్ భవనాల్లో కూడా దాడులు జరిగే ప్రమాదముందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరించింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్ని లక్షల మంది హాజరైనా ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిలిటరీ, పోలీసు బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండనున్నారు.