గాడ్స్ లవ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీవీ రామారావు

కొవ్వూరు, తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో పూలపల్లి బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాడ్స్ లవ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వృద్ధులకు టీవీ రామారావు చేతుల మీదుగా వస్త్రాలు పంచిపెట్టడం జరిగింది. కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గాడ్స్ లవ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థకి కొవ్వూరు జనసేన పార్టీ తరఫున 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు డేగల రాము, కొవ్వూరు మండలం ప్రధాన కార్యదర్శి పూటి రమేష్, దిరుసుమిల్లి అభిరామ్, గజ్జరం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.