మంత్రి కేటీఆర్, రేవంత్ మధ్య ట్విట్టర్ వార్

డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నెలకొంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని…. మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్…”నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను…రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?…ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ…ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?…రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా” అని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా?.. హైదరాబాద్‌కు అర్హత లేదా?: కేటీఆర్‌ బీజేపీకి చెంప చెల్లుమనిపించారు: తలసాని తెలంగాణలో బీజేపీ సీఎంను చూడాలన్నదే కోరిక: విద్యాసాగర్‌రావు ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు