వంగవీటి రంగా జయంతి సందర్భంగా అన్నదానం చేసిన ఉలవపాడు జనసేన

కందుకూరు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగా 75వ జయంతి సందర్భంగా ఉలవపాడు మండల కాపు యువసేన అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బాలచందర్ నాయుడు రోడ్డుపక్కల ఉన్నటువంటి పేదలకు అన్నము, పండ్లు పంపిణీ చేసారు. నేటికీ వంగవీటి మోహనరంగా పేరు చెపితే వణికిపోయే ప్రత్యర్థులు ఒక వైపు అయితే, ఆయన్ని చూడకుండా కూడా ఆయన పేరు వింటూ పెరిగిన నేటి యువత ఆయన ఫోటో పెట్టుకొని దైవంలా కొలుస్తూ, ఆయన కోసం ఎక్కడికైనా సిద్ధం, అంటూ అడుగులేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల కాపు యువసేన అధ్యక్షుడు బాలచందర్ నాయుడు, ఉపాధ్యక్షుడు పల్ల సురేష్, నవీన్ నాయుడు, జస్వంత్ నాయుడు, గోరంట్ల సతీష్, కొనికి తిరుమల, క్రాంతి, అభిజిత్ రంగా అభిమానులు చందు, సాయి, నవీన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.