జనసేన ఆధ్వర్యంలో మన ఊరు మనఆట ముగ్గుల పోటీలు

  • జనసేన పార్టీ మహిళా కార్యాలయం ఆవరణలో కన్నుల పండుగగా మన ఊరు మనఆట ముగ్గుల పోటీల కార్యక్రమం
  • మన సాంప్రదాయాలు సంస్కృతులను పరిరక్షించుకుందాం
  • ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతుల అందజేత
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు శనివారం ఆ పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మన ఊరు-మనఆట కార్యక్రమంలో భాగంగా మహిళా మణులకు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మహిళలను ఉత్తేజపరిచి కుల మతాలకు అతీతంగా ఇక్కడ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని గెలుపొందిన ప్రతి మహిళకు బహుమతులు అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. సుమలత, కళ్యాణి, శైలజ, లక్ష్మి, సరోజమ్మ, శ్రావణి, అనురాధ, అషీద్, సానియా, గాయత్రి, చంద్రకళ, సురేఖ, సుకన్య తదితరులు పాల్గొనడం జరిగింది.