ఎయిమ్స్ లో చేరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌

కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఈ వ్యాధి తాలుకు లక్షణాలు మనుషుల ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా వ్యాధి లక్షణాలు కొందరిలో కనిపిస్తూనే ఉన్నాయి. విజయవంతంగా కరోనా నుంచి బయటపడ్డామని సంతోషించే లోపే మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయి.

తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొకిర్యాల్ (61) ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న మంత్రికి తాజాగా మళ్లీ ఆరోగ్య సంబంధిత సమస్యలు రావడంతో మంగళవారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్‌లో చేరారు. మంత్రికి కరోనా తాలుకు కొన్ని లక్షణాలు ఇంకా పూర్తిగా నయం కాలేవని తెలుస్తోంది. రమేశ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా కేంద్ర మంత్రి రమేశ్ ఈ ఏడాది ఏప్రిల్ 21న కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో మంత్రి ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నేను కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నాకు సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్ష చేయించుకోండని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.