కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష

ప్రస్తుత కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పలు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కోవిడ్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అసోం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాల గురించి ఈ సందర్భంగా రాష్ట్రమంత్రులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు.