బత్తుల దంపతుల చేతుల మీదుగా ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభం

  • అత్యంత వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ

రాజానగరం మండలం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలాచెరువు నందు జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామపెద్దల మధ్యన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం రాక్షసపాలన కొనసాగిస్తూ, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం కావడంతో, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జనసైనికులు సమైక్యంగా కష్టపడి గెలుపే లక్ష్యంగా పోరాడి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ సమిష్టిగా పోరాడాలని, స్థానిక వైసిపి నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం పేరిట కేవలం కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వాటినే బయట ప్రపంచానికి చూపిస్తున్నారని, వాస్తవానికి నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందడం లేదని, సహజ వనరులని యదేచ్చగా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని. అందువల్ల ఈ అరాచక ప్రభుత్వానికి జనసైనికులు చరమగీతం పాడి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే వరకు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గళ్ళ రంగా, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కాళ్ళ చక్కరావు, కాళ్ల బాలు, సూరపురెడ్డి రాజారావు, వేగిశెట్టి రాజు, యర్రంశెట్టి శ్రీను, బొంగ స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, బోయిడి వెంకటేష్, అడ్డాల శ్రీను, కురుమళ్ల మహేష్, నాతిపాం దొరబాబు, అరిగెల రామకృష్ణ, తోట అనిల్ వాసు, ముక్కపాటి గోపాలం, ఆనందాల గోవింద్, పంతం సూరిబాబు, కానవరం సతీష్, సూరిబాబు, అక్కిరెడ్డి వేణు, నల్ల దుర్గాప్రసాద్, చిట్టిప్రోలు సత్తిబాబు, అడ్డాల దొరబాబు, పిన్నమరెడ్డి విజయ్, చిక్కిరెడ్డి దొరబాబు, రేలంగి బాబూరావు, వీర్రాజు, ఇతర నాయకులు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.