ఆగవేలి గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం ఆగవేలి గ్రామంలో పులి శేఖర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సిజి రాజశేఖర్, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి రేఖ జవాజి కర్నూల్ సమన్వయకర్త షేక్ హర్షద్, పాల్గొన్నారు. తదనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు సిజి రాజశేఖర్, హర్ష, రేఖ జవాజి అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరాములు తెలుగు యువత అధ్యక్షుడు రఫీ మాజీ సర్పంచులు వెంకటేశ్వర్లు సోమలింగ గౌడ్ బ్రహ్మయ్య సంగాల మాదన్న మల్లేష్ చిన్న వెంకటేశ్వర్లు, అధ్యక్షతన జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమన్నారు, మీరు ఓడిపోవడానికి సిద్ధం మేము గెలవడానికి సిద్ధం, మీరు పోలవరం రాజధాని కట్టలేక పోయారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కట్టడానికి సిద్ధం, అలాగే పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఒక సభలో ఉద్దేశించి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ వాళ్లు కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళ అంటున్నారు, మేము ఒకటే సమాధానం చెబుతున్న ఎమ్మెల్యేకి, మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నట్లు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి వైదొలుగుతాం, మీరు నిరూపించ లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజనం చేసి ఇంట్లో కూర్చుంటారా అని సవాలు చేశారు. అలాగే అవగాహన లేదు అంటున్నారు, నియోజకవర్గంలో ఏ విషయములోనైనా మేము సిద్దం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అన్నారు, ఎమ్మిగనూరు ఇన్చార్జ్ రేఖ జవాజి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అన్నదమ్ములుగా కలిసి మెలిసి పనిచేయాలని ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పని చేద్దాం అధికారాన్ని స్థాపిద్దాం అన్నారు, కర్నూలు ఇంచార్జ్ అర్షద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేని చేతగాని సీఎం జగన్ రెడ్డి అన్నారు. వీరికి పరిపాలన చేయడం చేతకాక పోవడం వల్ల ఈరోజు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో సరైన అవగాహన లేదన్నారు, సరైన అవగాహన ఉండి ఉంటే, నియోజవర్గం నుంచి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారు కాదని, నియోజకవర్గ ప్రజలకు సరైన ఉపాధి కల్పించలేక పోయింది అన్నారు. టిడిపి క్రిష్ణగిరి మండల అధ్యక్షుడు, శ్రీరాములు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు, చెయ్యి కలిపి టిడిపి నాయకులకు అండదండగా నిలిచిన వ్యక్తి, కావున మేము ఎల్లప్పుడూ జనసేన పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటామని, 2024లో జనసేన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పత్తికొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు తత్యము అని అన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది, ఈ రాష్ట్రంలో నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని, ఒక్క ఛాన్స్ అని చెబితే, ప్రజలు గుడ్డిగా నమ్మి ఓటు వేశారు, ఇప్పుడు ప్రజలకు అర్థమైంది జగన్ పోవాలి రాష్ట్రం బాగుండాలి, అనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని అన్నారు. బోయ గోవిందు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు బాలు, బాబ్జి, రామచంద్ర, నాగేశ్వరరావు, తిరుపాల్, చిరంజీవి, మొదలాగు జనసేన పార్టీ నాయకులు టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.